Ram Charan: అదిరిపోయింది పవన్​ కల్యాణ్​ గారు!

Hyderabad: మాస్​ డైరెక్టర్​ హరీష్​ శంకర్(Harish Shankar)​, పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఉస్తాద్​ భగత్​ సింగ్(Ustaad Bhagat Singh). ఈ సినిమా అనౌన్స్​ చేసినప్పటినుంచీ అప్​డేట్స్​ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక, తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్​ గ్లింప్స్​ విడుదల చేసి అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చారు డైరెక్టర్​ హరీష్​​. మే 11న రిలీజ్​ చేసిన ఉస్తాద్​ భగత్​ సింగ్​ ఫస్ట్​ గ్లింప్స్​ అభిమానులను తెగ ఆట్టుకుంటోంది. యూట్యూబ్​లో కూడా మిలియన్ల వ్యూస్​తో రికార్డులు క్రియేట్​ చేస్తోంది. ఇక ఈ గ్లింప్స్​పై తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Changer) కూడా రియాక్ట్​ అయ్యారు.

‘పవన్ కళ్యాణ్ గారి ఈ మాస్ గ్లింప్స్ నాకు బాగా నచ్చింది. ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలో చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నాను. టీమ్ మొత్తానికి గుడ్ లక్’ అంటూ చరణ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల(Sreeleela) హీరోయిన్​గా నటిస్తోంది.
తాజాగా విడుదల చేసిన గ్లింప్స్​‘ప్ర‌తి యుగంలో అధ‌ర్మం పెరిగిన‌ప్పుడు దేవుడు అవ‌త‌రిస్తాడ‌ని చెప్పే భ‌గ‌వ‌ద్గీత‌లోని శ్లోకంతో ఈ వీడియో మొదలైంది. ప‌వ‌ర్‌స్టార్ పవన్ కల్యాణ్ త‌న‌దైన స్టైల్‌తో కనిపించి మెప్పించారు. మ‌హంకాళి పోలీస్ స్టేష‌న్‌, ప‌త్త‌ర్ గంజ్‌, ఓల్డ్ సిటీ ఎస్‌ఐగా ప‌వ‌న్ కనిపించబోతున్నారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక గ్లింప్స్ చివ‌ర‌ల్లో ‘ఈసారి పెర్ఫామెన్స్ బ‌ద్ధ‌ల‌వుతుంది..సాలే’ అని పవన్ చెప్పిన డైలాగ్ అభిమానుల్లో పూనకం తెప్పిస్తోంది. గబ్బర్​ సింగ్​ని మించిన హిట్​ గ్యారంటీ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఇక, రామ్​ చరణ్​ కోలీవుడ్​ డైరెక్టర్​ శంకర్​(Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్​ ఛేంజర్(Game Changer)​ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు.