Ram Charan: రాముడి పాత్ర‌లో..!

Ram Charan: ప్ర‌శాంత్ వ‌ర్మ (prashanth varma) ద‌ర్శ‌కత్వంలో తేజ స‌జ్జ (teja sajja)  న‌టించిన హ‌నుమాన్ (hanuman) సినిమా బాక్సాఫీస్‌ను దున్నేస్తోంది. టాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ హ‌నుమాన్ అనే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో దీనికి పార్ట్ 2 తీయాల‌ని ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ అనుకుంటున్నారు. అయితే ఇక్క‌డ ఒక ఇంట్రెస్టింగ్ చ‌ర్చ న‌డుస్తోంది. పార్ట్ 2లో రామ్ చ‌ర‌ణ్ రాముడి పాత్ర‌లో న‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. పార్ట్ 2కి జై హ‌నుమాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. రామ్ చ‌ర‌ణ్ రాముడి పాత్ర‌లో అంటేనే సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో క‌ళ్ల ముందు క‌నిపించేస్తోంది క‌దూ..!