Ram Charan: ఇండియ‌న్ 2లో చర‌ణ్..?

Ram charan in Indian 2: శంక‌ర్ (shankar) ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ (ram charan) గేమ్ ఛేంజ‌ర్ (game changer) అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోప‌క్క శంక‌ర్.. క‌మ‌ల్ హాస‌న్‌తో (kamal haasan) ఆల్‌టైం బ్లాక్ బ‌స్ట‌ర్ భార‌తీయుడు (bharateeyudu) సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 (indian 2) తీస్తున్నారు. ఈ రెండు సినిమాలు శంక‌ర్ తీస్తున్న‌వే కాబ‌ట్టి.. ఇండియ‌న్ 2 సినిమాలో శంక‌ర్.. రామ్ చ‌ర‌ణ్ కోసం స్పెష‌ల్‌గా కేమియో రోల్ రాసిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని నిమిషాల పాటు ఇండియ‌న్ 2 సినిమాలో రామ్ చ‌ర‌ణ్ క‌నిపిస్తార‌ట‌. దీనిపై అఫీషియ‌ల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇండియ‌న్ 2లో రామ్ చ‌ర‌ణ్ కేమియో రోల్‌లో క‌నిపిస్తే ఆ సీన్ మామూలుగా ఉండ‌దు. ఇంకో 40 రోజుల్లో గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ అయిపోతుంది. 2024 స‌మ్మ‌ర్‌కి సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.