Mega Princess: క్లీంకారా కొణిదెల‌

Hyderabad: రామ్‌చ‌ర‌ణ్ (ram charan) ఉపాస‌న (upasana) దంప‌తుల గారాల ప‌ట్టికి (mega princess) నామ‌క‌ర‌ణం చేసేసారు. ఈరోజు చిరంజీవి నివాసంలో నామ‌క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇంత‌కీ మెగా ప్రిన్సెస్ పేరేంటో తెలుసా.. క్లీంకారా కొణిదెల‌ (klin kaara konidela). వింత‌గా ఉంది క‌దూ..! ల‌లితా స‌హస్ర నామంలోని ఓంకార రూపిణి క్లీంకార వాసిని..జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి.. అన్న ప‌దాల్లో నుంచి క్లీంకార అనే పేరు పెట్టారు. ఈ పేరు అమ్మవారికి ప్ర‌తీక‌గా ఉంటుంద‌ని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. చెంచు గిరిజ‌నుల ఇల‌వేల్పు భావ్ర‌మ్మ దేవి ఆశీస్సుల‌తో పాప‌కు క్లీంకార పేరు పెట్టిన‌ట్లు పేర్కొన్నారు.