Rhyme Konidela: డ్యూటీ ఎక్కిన రైమ్..!

Hyderabad: రామ్‌చ‌ర‌ణ్‌ (ram charan), ఉపాస‌న‌లు (upasana) పాప పుట్ట‌క‌ముందే త‌ల్లిదండ్రుల‌య్యారు. ఎవరికి అనుకుంటున్నారా? అదేనండీ.. ఎప్పుడూ వారి చేతిలో ఓ క్యూట్ కుక్క పిల్ల ఉంటుంది క‌దా. దానిని సొంత కొడుకులా చూసుకుంటారు. వాడి పేరు రైమ్ కొణిదెల‌ (rhyme konidela). ఇప్పుడు వాడికి తోడుగా ఓ చెల్లి పుట్టేసింది కాబ‌ట్టి.. బిగ్ బ్ర‌ద‌ర్‌గా త‌న డ్యూటీని చేసేస్తున్నాడు. క్లీంకారా కొణిదెల (klin kaara konidela) ఉయ్యాలలో ప‌డుకుని ఉంటే.. నిద్ర‌పోతోందో లేదో అన్న‌ట్లు సోఫా ఎక్కి మ‌రీ రైమ్ (rhyme konidela) క్లీంకారాను చూస్తున్న ఫొటోను చ‌ర‌ణ్ షేర్ చేసారు. రైమ్‌కి ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. వీడికి దాదాపు 70 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రైమ్.. క్లీంకారాను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న ఫొటో చూసి నెటిజ‌న్స్ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఒరేయ్ రైమ్.. చెల్లెలిని జాగ్ర‌త్తగా చూసుకో అని కామెంట్స్ చేస్తున్నారు.

ram charan upasana rhyme
ram charan upasana rhyme