G20 Summit: రామ్ చరణ్ క్రేజ్.. స్టేజ్‌పై నాటు నాటు స్టెప్!
Srinagar: RRR సినిమా సక్సెస్‌తో గ్లోబల్ స్టార్‌గా మారారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ సినీ పరిశ్రమ నుంచి పలు ప్రతిష్టాత్మకమైన సదస్సుల్లో పాల్గొంటూ అరుదైన గౌరవాలను దక్కించుకుంటున్నారు. తాజాగా కశ్మీర్ – శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న 2023 G20 సదస్సు లో చరణ్ పాల్గొన్నారు. నేటి (మే 22) నుంచి మొదలైన ఈ సదస్సు మూడు రోజులు పాటు జరగనుంది. ఈ సదస్సులో 17 దేశాల నుంచి ప్రతినిధులు.. ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. మన దేశం తరుపున రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. సినిమా అభివృద్ధి, కాశ్మీర్ సినిమా రంగంలో ఎటువంటి పాత్ర పోషిస్తుందనే అంశాలపై మాట్లాడారు. అనంతరం సమ్మిట్ లో పాల్గొన్న కొరియన్ అంబాసడర్స్ తో కలిసి వరల్డ్ ఫేమస్ సాంగ్, ఆస్కార్(Oscar) అందుకున్న నాటు నాటు (Naatu Naatu) కి స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియోని.. ఎంబసీ ప్రతినిధులు తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత అక్కడ జరుగుతున్న మొదటి అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో.. అందరు G20 సదస్సుని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అలాంటి సదస్సులో రామ్ చరణ్ భాగమవడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.