Game Changer: ఇండియ‌న్ 2కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారా?

శంక‌ర్ (shankar) డైరెక్ష‌న్‌లో రామ్ చ‌ర‌ణ్ (ram charan) యాక్ట్ చేస్తున్న ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజ‌ర్ (game changer). భారీ బ‌డ్జెట్‌తో దిల్ రాజు (dilraju) సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ (kiara advani) హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లో ఆగిపోయింద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. కానీ కొంద‌రు ఆర్టిస్ట్‌ల డేట్లు స‌ర్దుబాటు కాక వాయిదా ప‌డిందే కానీ సినిమా ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని టీం క్లారిటీ ఇచ్చింది.

అన్నీ అనుకున్న‌ట్లు కుదిరి ఉంటే ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఇక స‌మ్మ‌ర్‌కి రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు. ఈ విష‌యంలో చ‌ర‌ణ్ అప్‌సెట్ అయ్యార‌ట‌. స‌రిగ్గా ప్లాన్ చేసి ఉంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యేద‌ని కాస్త ఇరిటేట్ అయిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రోప‌క్క శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్‌తో (kamal haasan) ఇండియ‌న్ 2 (indian 2) సినిమా తీస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ అవుతోంది. ఇండియ‌న్ 2 కి గేమ్ ఛేంజ‌ర్ (game changer) షూటింగ్‌ల‌కు చెరో 15 రోజులు కేటాయిస్తున్నారు.

ఎప్పుడైతే క‌మల్ హాస‌న్ విక్ర‌మ్ (vikram) సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిందో అప్ప‌టినుంచి ఆయ‌న గేమ్ ఛేంజ‌ర్‌కు బ‌దులు ఇండియ‌న్ 2 సినిమాకే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు టాక్. దాంతో వేరే సినిమాలను చ‌ర‌ణ్ ఒకే చేయ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆల్రెడీ చ‌ర‌ణ్ ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చి బాబుతో ఓ సినిమాను ఓకే చేసారు. గేమ్ ఛేంజ‌ర్ లేట్ అవుతుండడంతో అటు బుచ్చి బాబు సినిమా షూటింగ్ లేట్ అయిపోతోంది. ఇప్పుడు గేమ్ ఛేంజ‌ర్ సినిమా షూటింగ్ ఇంకో 40 రోజుల పాటు జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇటీవ‌ల రూ.90 కోట్ల ఖ‌ర్చుతో పాట‌ల‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది.