Ram Charan: క్లీంకారా స్పెషల్ రూం చూసారా?
Hyderabad: రామ్ చరణ్ (ram charan) ఉపాసన (upasana) దంపతుల గారాల పట్టి క్లీంకారా కొణిదెల (klin kaara konidela) కోసం స్పెషల్‌గా నర్సరీ రూం డిజైన్ చేయించారట. పెళ్లైన దాదాపు 11 ఏళ్ల తర్వాత చరణ్, ఉపాసన తల్లిదండ్రులయ్యారు. దాంతో తమ కూతురికి ఏం చేసినా అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్స్ వేస్తున్నారు. ఇక చరణ్ ఇంట్లోని ఓ రూంను స్పెషల్‌గా క్లీంకారా కోసం కేటాయించారట. అందులో మొత్తం ఫారెస్ట్ థీంను (forest theme) డిజైన్ చేయించారట. రూంలోని గోడలకు వైట్, గ్రే రంగులు వేయించి వాటిపై ఫారెస్ట్ పెయింటింగ్స్ వేయించారు. ఇక రూంలోని ఫర్నీచర్ మొత్తం తెలుపు రంగువే ఎరేంజ్ చేసారట. ఫారెస్ట్ థీమ్ నర్సరీ కావడంతో పాప ఆడుకోవడానికి అన్నీ జంతువుల సాఫ్ట్ టాయ్సే కొని అల్మారాల్లో డెకరేట్ చేసారు.
ఇదంతా పవిత్ర రాజారాం (pavitra rajaram) అనే సెలబ్రిటీ ఇంటీరియర్ డిజైనర్‌తో డిజైన్ చేయించారు. చరణ్, ఉపాసనకు ప్రకృతి అన్నా అడవుల్లో తిరగడం అన్నా చాలా ఇష్టమట. అందుకే పాపకు కూడా అదే అలవాటు చేయాలని ఇలా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఉపాసన (upasana) ఓ పులిని దత్తత తీసుకుని పెంచుకుంటోంది. రామ్ చరణ్ (ram charan) కూడా కుక్కలు, పిల్లులు, గుర్రాలను పెంచుతున్నారు.