Nickname: మాకూ ఉన్నాయ్ ముద్దు పేర్లు..!
Hyderabad: భార్యా భర్తలు ఒకరినొకరు ముద్దు పేర్లతో (nickname) పిలుచుకుంటూ ఉంటే ఎంతో క్యూట్‌గా ఉంటుంది. ఈ నిక్ నేమ్స్ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తాయి. నిక్ నేమ్స్ కామన్ కపుల్‌కేనా మా భర్తలకు కూడా ఉన్నాయి అంటున్నారు స్టార్ హీరోల భార్యలు ఉపాసన కామినేని, నమ్రత శిరోద్కర్.
ఉపాసన (upasana kamineni) తన భర్త రామ్ చరణ్‌ను (ram charan) ముద్దుగా మిస్టర్ RC అని పిలుస్తారు. ఇంట్లో ఏమని పిలుస్తారో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో చరణ్ గురించి ఏ పోస్ట్ పెట్టినా మిస్టర్ RC అని సంబోధిస్తారు. ఇప్పుడు నమ్రత (namrata shirodkar) కూడా ఇదే స్టైల్ ఫాలో అవుతున్నట్లున్నారు. ఈరోజు మహేష్ బర్త్‌డే (mahesh babu). ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసి.. హ్యాపీ బర్త్‌డే MB అని క్యాప్షన్‌లో రాసారు. అలా ఇద్దరు స్టార్ హీరోలకు తమ భార్యలు క్యూట్ నిక్ నేమ్స్ ఇచ్చేసారు. (nickname)
అయితే ఇక్కడ ఇద్దరు భార్యలు తమ భర్తలకు నిక్ నేమ్స్ పెడితే.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) మాత్రం తన భార్యకు ఒక ముద్దు పేరు పెట్టారు. కొన్ని రోజుల క్రితం లక్ష్మీ ప్రణతి (lakshmi pranathi) బర్త్‌డే సందర్భంగా తారక్ విషెస్ చెప్తూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మలూ.. అని క్యూట్ క్యాప్షన్ ఇచ్చారు. మరి ప్రణతి.. తారక్‌ని ఏమని పిలుస్తారో ఆయనే చెప్పాలి.