Ram Charan: “నన్ను పెళ్లికి ఎందుకు పిలవలేదు?”
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మధ్య జరిగిన ట్విటర్ సంభాషణ వైరల్‌గా మారింది. ఇటీవల మహీంద్రా సుజిత్ అనే వ్యక్తి పెళ్లికి వెళ్లారట. అయితే ఈ పెళ్లికి తనను ఎందుకు పిలవలేదు అని చరణ్ ట్విటర్‌లో మహీంద్రను అడిగారు. సుజిత్ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు? నేను ఆ పెళ్లి వేడుకకు దగ్గర్లోనే ఉన్నాను. నన్ను పిలిచి ఉంటే ఇంకా ఎంతో ఫన్‌గా ఉండేది అని ట్వీట్ చేసారు. ఇందుకు మహీంద్ర స్పందిస్తూ.. ఒప్పుకుంటాను. పిలవకపోయాను. సారీ. నువ్వు నేర్పించిన డ్యాన్స్ స్టెప్ బాగా వేయాలని తెగ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉండిపోయాను. ఈ సారి మిస్సవ్వను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అని మహీంద్ర ట్వీట్ చేసారు. RRR సినిమాలోని నాటు నాటు పాటను చరణ్ మహీంద్రాకు నేర్పించారు. వీరిద్దరి వీడియోకు 70 లక్షల వ్యూస్ వచ్చాయి.