Ram Charan: హాలీవుడ్​నే ఇండియాకి తీసుకొస్తా!

Srinagar: RRR సినిమాతో గ్లోబల్​స్టార్​గా మారిపోయిన మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్(Ram Charan)​ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అరుదైన సత్కారాలు అందుకుంటున్నారు. తాజాగా కశ్మీర్ శ్రీనగర్ (Srinagar) లో జరుగుతున్న G20 సదస్సు(G20 Summit)లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆ సమ్మిట్ లో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చెందుకు 17 దేశాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఇక మనదేశానికి రామ్​చరణ్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) కు రాష్ట్ర హోదాను తొలగించిన తర్వాత అక్కడ టూరిజం డెవలప్ చేసేందుకు సినిమా షూటింగ్స్ కూడా జరగాలనే అంశం పై చర్చ జరిగింది.

ఈ అంశంపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలోని అందమైన షూటింగ్ లొకేషన్స్ ని నేను ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను. ఒకవేళ నాతో హాలీవుడ్(Hollywood) నిర్మాతలు, దర్శకులు సినిమా తియ్యాలి అని అనుకున్నా.. వారిని ఇండియా రావాలని కండిషన్ పెడతా’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రామ్​ చరణ్​ హాలీవుడ్​ ఎంట్రీ ఖాయమైందని సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్​. ఇక ఇదే వేదికపై చాలా విషయాలు పంచుకున్నారు రామ్​ చరణ్.

తన తండ్రి మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) గురించి మాట్లాడుతూ.. ‘మా నాన్నగారి 68 సంవత్సరాలు. అయినా ఆయన నాలుగు సినిమాలు చేస్తూ ఇంకా బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషకం తీసుకునే యాక్టర్స్ లో ఆయన ఒకరు. ఇక ఇంతటి ఫేమ్ సంపాదించుకున్నా.. ఇప్పటికి ఇంకా ఉదయం 5:30 గంటలకు నిద్ర లేచి వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటారు. 68 ఏళ్ళ వయసులో కూడా ఆయన సినిమా పై, చేసే పని పై చూపించే డెడికేషన్ చూసి మాకు ఎంతో స్ఫూర్తి కలగజేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు చరణ్​. ఇక, ప్రస్తుతం చరణ్​ శంకర్​ డైరెక్షన్లో రూపొందుతున్న గేమ్​ ఛేంజర్(Game Changer)​ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.