Rakul Preet Singh: నన్ను ప్ర‌భాస్ సినిమా నుంచి త‌ప్పించారు

Rakul Preet Singh says she suffered because of nepotism

Rakul Preet Singh: నెపోటిజం వ‌ల్ల తాను కూడా చాలా ఇబ్బందిప‌డ్డాన‌ని అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్. తెలుగులో బాగా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ త‌న సినిమా ఎంట్రీని యారియా అనే హిందీ చిత్రంతోనే ఇచ్చారు. యారియా మంచి హిట్ అవ్వ‌డంతో ర‌కుల్‌కు టాలీవుడ్ నుంచి పిలుపు అందింది. ఆ త‌ర్వాత ర‌కుల్ టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు హిందీ సినిమాల్లోనూ న‌టించింది కానీ చాలా సినిమాల‌ను త‌న నుంచి స్టార్ కిడ్స్ లాగేసుకున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని రకులే స్వయంగా వెల్ల‌డించింది. “” నా నుంచి సినిమాల‌ను లాగేసుకున్నారు. నెపోటిజం నేను బాలీవుడ్‌లోనే ఎదుర్కొన్నాను. కానీ అన్ని రంగాల్లోనూ ఉంది. కానీ ఈ నెపోటిజం వ‌ల్ల నేను మ‌హా అంటే ఒక రోజు బాధ‌ప‌డ‌తాను. ఎందుకంటే రేపు నాకు పిల్ల‌లు పుట్టి వారు కూడా సినిమాల్లోకి వెళ్తాను అంటే నేను వారికి క‌చ్చితంగా సాయం చేస్తాను. అంతేకానీ.. నేను క‌ష్ట‌ప‌డ్డాను కాబ‌ట్టి మీరు కూడా క‌ష్ట‌ప‌డాలి అని నేను వారికి చెప్ప‌ను. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ కూడా అంతే. వారి త‌ల్లిదండ్రులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే త‌మ పిల్ల‌ల‌కు సాయం చేస్తున్నారు. అందులో త‌ప్పు లేదు. కానీ ఉన్న‌మాట చెప్పుకోవాలి. నేను నెపోటిజం వ‌ల్ల చాలా సినిమాలు కోల్పోయాను.

ఇక తెలుగులో కూడా నాకు ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది. న‌న్ను ప్ర‌భాస్ సినిమాలో తీసుకున్నారు. నాలుగు రోజులు షూటింగ్ కూడా చేసాను. ఆ త‌ర్వాత న‌న్ను తీసేసారు. క‌నీసం నాకు చెప్ప‌లేదు. దాంతో పోతే పోనీలే అని నేను వ‌దిలేసాను. నాకు టాలీవుడ్‌లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. స‌రైనోడు షూటింగ్ స‌మ‌యంలో బ‌న్నీ నాతో ఒక మాట‌న్నాడు. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాల‌ని నా ఆశ అని. ఇక ఎన్టీఆర్ విష‌యానికొస్తే అత‌ను పుట్టిందే యాక్ట‌ర్ అవ్వ‌డానికి “” అని తెలిపారు.

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత వ‌షు భ‌గ్నానీ కుమారుడైన జాకీ భ‌గ్నానీతో ఈ ఏడాది ర‌కుల్ వివాహం జ‌రిగింది. చివ‌ర‌గా ర‌కుల్ భార‌తీయుడు 2లో క‌నిపించారు. ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది.