Rakul Preet Singh Wedding: నా ప్రేమ‌నే గెలిచావురా.. వెయ్యేళ్లు నాతో ఉండ‌రా..!

Rakul Preet Singh Wedding: న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి ఓ ఇంటివార‌య్యారు. బాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల్లో ఒకరైన వ‌షు భ‌గ్నానీ (vashu Bhagnani) కుమారుడు, న‌టుడు జాకీ భ‌గ్నానీని (Jacky Bhagnani) పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గోవాలో అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహం కుటుంబీకులు, స‌న్నిహితుల సమ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

Screenshot 2024-02-22 at 1.07.08 AM

అలా మొద‌లైంది

ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీల‌ది దాదాపు నాలుగేళ్ల ప్రేమ‌. 2021లో తామిద్ద‌రం ప్రేమించుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్రక‌టించి అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో వీరిద్దరూ క‌లుసుకున్నార‌ట‌. అప్పుడే ప్రేమ‌లో ప‌డిన‌ట్లు స‌న్నిహితులు తెలిపారు. మ‌రి వీరిద్ద‌రూ ఎప్పుడు ఎలా క‌లిసారో తెలుసా? అస‌లైతే వీరిద్దరి ఇళ్లు ప‌క్క ప‌క్క‌నే ఉండేవి. కోవిడ్ లాక్‌డౌన్ ముందు వ‌ర‌కు ఒక‌రితో ఒకరికి సంబంధం లేన‌ట్లు ఉండేవారు. లాక్ డౌన్ ప‌డ్డాక అంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉండాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలోనే ఇద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి.. అది కాస్తా స్నేహంగా మారి ఏడు అడుగుల‌కు దారి తీసింది.

Screenshot 2024-02-22 at 1.10.00 AM

 

2021లో వీరిద్ద‌రూ త‌మ ప్రేమ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. సాధార‌ణంగా పెళ్లి చేసుకుంటున్న స‌మ‌యంలోనే సెల‌బ్రిటీలు తాము డేటింగ్‌లో ఉన్నామ‌ని ప్ర‌క‌టిస్తారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం కాస్త డిఫ‌రెంట్‌. బాలీవుడ్‌లో మీడియా వ‌ర్గాలు ఎప్పుడూ సెల‌బ్రిటీల‌ను ఓ కంట క‌నిపెడుతూనే ఉంటాయి. ఇక ప్రేమ‌లో ఉన్నాక తప్ప‌నిస‌రిగా బ‌య‌టికి వెళ్లాల్సి ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు ఇలా చాలా ప్రాంతాల‌కు క‌లిసి వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్‌తో వెళ్లినా కూడా అక్క‌డి మీడియా వ‌ర్గాలు వారి మ‌ధ్య ఏదో ఉంద‌ని రాసేస్తుంటాయి. చ‌క చ‌కా ఫోటోలు తీసి పోస్ట్ చేసేస్తుంటారు. అందుకే ముందే ప్ర‌క‌టించేస్తే ఆ త‌ర్వాత మీడియా వ‌ర్గాలు ఫాలో అయినా కూడా పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌ద‌ని భావించిన ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీలు త‌మ ప్రేమ విష‌యాన్ని ముందుగానే ప్ర‌క‌టించేసారు. (Rakul Preet Singh Wedding)

నీతో లేనప్పుడు రోజులు రోజుల్లానే ఉండ‌వు. నువ్వు లేకుండా నేను తినే ఆహారం అస‌లు రుచిక‌రంగానూ అనిపించ‌దు. నా ప్ర‌పంచ‌మైన నీకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అని జాకీ భ‌గ్నానీ ర‌కుల్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త ప‌రుస్తూ త‌మ ప్రేమ సంగ‌తిని ప్ర‌క‌టించేసారు.

Screenshot 2024-02-22 at 1.07.01 AM

సెల‌బ్రిటీల పెళ్లిళ్లంటే బాలీవుడ్ మీడియా వ‌ర్గాలు అలెర్ట్ అవుతాయి. అక్క‌డి ఫోటోగ్రాఫ‌ర్లు డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు వెళ్లినా కూడా స్పెష‌ల్‌గా టికెట్ వేసుకుని వెళ్లి మ‌రీ ర‌హ‌స్యంగా ఫోటోలు తీస్తుంటారు. విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శ‌ర్మ‌ (Anushka Sharma), ర‌ణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపిక ప‌దుకొణెల (Deepika Padukone) వివాహ వేడుక‌ల స‌మ‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఎక్క‌డ మీడియా వ‌ర్గాల ద్వారా ఫోటోలు, వీడియోలు లీక్ అవుతాయోన‌ని వారు వేరే దేశాల్లో పెళ్లి చేసుకున్నారు. అయినా కూడా విరుష్క‌, ర‌ణ్‌దీప్ జంట‌ల ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి.

ఇలాంటివి జ‌రుగుతాయ‌నే ర‌కుల్, జాకీ భ‌గ్నానీలు కూడా వేరే దేశానికి వెళ్లి ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కానీ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఓసారి ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగిన స‌మ్మిట్‌లో విదేశాల్లో పెళ్లిళ్లు వ‌ద్దు. ఇండియాలోనే ఎన్నో సుంద‌ర‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఇక్క‌డే చేసుకోండి అని విన్నవించుకున్నారు. దాంతో ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీలు విదేశాల్లో పెళ్లి అనే టాపిక్‌ను ప‌క్క‌న పెట్టి ఇండియాలోనే (గోవా) వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ సినిమాల విష‌యానికొస్తే పెళ్లికి ముందు వ‌ర‌కు కూడా ర‌కుల్ చేతిలో పెద్ద‌గా ఆఫ‌ర్లు ఏమీ లేవు. ఇక ఇప్పుడు పెళ్లి అయిపోవ‌డంతో సినిమాలు చేయ‌ర‌నే టాక్ న‌డుస్తోంది.

చివ‌ర‌గా రకుల్ తెలుగులో కొండ‌పొలం (Konda Polam) అనే సినిమాలో క‌నిపించారు. ఆమె చేతిలో త‌మిళం, హిందీ సినిమాలు మాత్ర‌మే ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న ఇండియ‌న్ 2 (Indian 2) సినిమాలో ర‌కుల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

GG3wZSLa4AA6Aje