Rakul Preet Singh బ్యాచిలర్ పార్టీలో మంచు లక్ష్మీ!
Rakul Preet Singh: టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ సందర్భంగా తన ఫ్రెండ్స్‌తో థాయ్‌లాండ్‌లో గ్రాండ్‌గా బ్యాచిలర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీలో రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మంచు లక్ష్మి, నటి ప్రగ్యా జైశ్వాల్ పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో పెళ్లి
ప్రముఖ నిర్మాత వషు భగ్నానీ కుమారుడు, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో (jacky bhagnani) రకుల్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.
పెళ్లి ఎక్కడో తెలుసా?
రకుల్, జాకీ ముందు మిడిల్ ఈస్ట్ దేశంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారి టీం కూడా వెల్లడించింది. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. డెస్టినేషన్ వెడ్డింగ్‌ల అవసరం లేదని.. ఇండియాలోనే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే రకుల్, జాకీ తమ పెళ్లిని వేరే దేశంలో కాకుండా గోవాలో ప్లాన్ చేసారు.