Rakshit Shetty: తెలుగోళ్లు సినిమా బాలేక‌పోయినా చూస్తారు

తెలుగు ఆడియ‌న్స్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి (rakshit shetty). ఆయ‌న క‌న్న‌డ‌లో న‌టించిన ఓ సినిమాను తెలుగులో స‌ప్త సాగ‌రాలు దాటి (sapta saagaralu dhaati) అనే టైటిల్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ రిలీజ్ చేసింది. సినిమాను తెలుగులోనూ హిట్ చేసిన నేప‌థ్యంలో ర‌క్షిత్ శెట్టి మాట్లాడుతూ.. తెలుగోళ్లు ఎంత మంచోరంటే.. సినిమా బాలేద‌ని ఎవ‌రైనా చెప్తే.. అరె ఎందుకు బాలేదు అని తెలుసుకోవ‌డానికైనా చూస్తారు. తెలుగు ఆడియ‌న్స్‌ సినిమా అంటే ఒక‌ క‌ల్చ‌ర్‌తో స‌మానంగా చూస్తారు. ఇక్క‌డ సినిమాను సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్లు మ‌రెక్క‌డా చేసుకోరు అని అన్నాడు. చార్లీ 777 సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా దగ్గ‌రైపోయాడు ర‌క్షిత్ శెట్టి. దాంతో అత‌ని సినిమాల‌ను తెలుగులోనూ డ‌బ్ అవుతున్నాయి.