Rakhi Sawant: నా న్యూడ్ పిక్స్ అమ్ముకున్నాడు..మాజీ భర్తపై ఆరోపణలు
బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ (rakhi sawant) గురించి తెలీనివారు ఉండరు. ఎప్పడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే రాఖీ.. ఇటీవల ఆదిల్ దుర్రానీ (adil durrani) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నెల రోజులకే వారిద్దరూ విడిపోయారు. ఆదిల్ తనను చావబాదేవాడని వేరే దారి లేక విడాకులకు అప్లై చేసానని తెలిపింది. అయితే బెయిల్‌పై విడుదలైన ఆదిల్ మీడియా ముందుకు వచ్చి రాఖీ తన జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపణలు చేసాడు. దాంతో రాఖీ కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఆదిల్ తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమని.. తన న్యూడ్ ఫొటోలను రూ.47 లక్షలకు అమ్ముకున్న వ్యక్తి ఆదిల్ అని షాకింగ్ ఆరోపణలు చేసింది. (rakhi sawant)
“” నేను ఆదిల్‌ని పెళ్లి చేసుకున్నాక దుబాయ్ వెళ్లిపోయాను. అప్పటికే అతని టార్చర్ మొదలైనప్పటికీ వైవాహిక జీవితంలో ఇవి కామనే అనుకుని మౌనంగా ఉన్నాను. ఓ రోజు బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే వీడియోలు తీసాడు. నేను అతని భార్యని అయినప్పటికీ అతను నన్ను రేప్ చేసాడు. నేను ఎదురుతిరిగితే నా వీడియోలు బయటికి వస్తాను. దాంతో ఏం చేయాలో తెలీక సైలెంట్‌గా అన్నీ భరించాను. ఒక్కసారి నా న్యూడ్ వీడియోలు బయటికి వస్తే నేను ఈ సమాజంలో ఎలా తలెత్తుకుని తిరగాలి? “” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రాఖీ.