Rakesh Master చివరి మాటలు: నేను అస్తమిస్తున్నా
Hyderabad: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (rakesh master) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వడదెబ్బతో అనారోగ్యం పలైన రాకేష్ మాస్టర్ (rakesh master).. డయాబెటిక్ పేషెంట్ అవ్వడంతో ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి నిన్న సాయంత్రం 5 గంటలకు గాంధీ హాస్పిటల్‌కు తుదిశ్వాస విడిచారు. అయితే రాకేష్ మాస్టర్‌కి తాను చనిపోతానని ముందే తెలుసేమో. అందుకే తన శిష్యుడితో కలిసి చేసిన ఓ వీడియోలో తాను అస్తమిస్తున్నానని ముందే చెప్పేసారు.
“నా శరీరంలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. వీడు ఉదయించే సూర్యుడు..నేను అస్తమిస్తున్న సూర్యుడ్ని. నాకు ఒంట్లో బాలేనప్పుడు వీడు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అన్నీ తిరిగాక ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకు రా అని అడిగాను. ఇందుకు వాడు సమాధానంగా.. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మీరే నాకు అన్నీ అన్నాడు. మా వదినమ్మ అయిన మీ అమ్మను జాగ్రత్తగా చూసుకోరా” అంటూ వీడియోలో రాకేష్ మాస్టర్ చెప్తుంటే ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు.