Rajkiran: లేచిపోయినందుకు క్షమించు నాన్నా.. ఇక నీతోనే ఉంటా
Rajkiran: ప్రముఖ తమిళ నటుడు రాజ్ కిరణ్ కుమార్తె జీనత్ ప్రియ (zeenat priya) తిరిగి ఇంటికి వచ్చేసారు. 2022లో జీనత్ ప్రియ మునిష్ రాజా అనే తమిళ నటుడిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు జీనత్ మునిష్ వల్ల కష్టాలు పడుతున్నారు. అతను కొడుతున్నాడని చిత్ర హింసలు పెడుతున్నాడంటూ వీడియో రిలీజ్ చేసారు. నాన్నా.. క్షమించు. నీ మాట కాదని ఇంట్లో నుంచి లేచిపోయా. ఇక నీతోనే ఉంటాను నాన్నా అంటూ వీడియోలో కన్నీరుమున్నీరయ్యారు. రాజ్‌కిరణ్ జీనత్ ప్రియను దత్తత తీసుకున్నారు. జీనత్ తిరిగి ఇంటికి వచ్చేయడంతో రాజ్ కిరణ్ సంతోషంగా కూతురిని స్వాగతించారు.