Rajinikanth: షాకింగ్.. సినిమా ఫుటేజ్ మిస్సింగ్..!

Rajinikanth: సినిమా రంగంలో ఇంత‌క‌న్నా షాకింగ్ విష‌యం మరొక‌టి ఉంటుందా? క‌ష్ట‌ప‌డి సినిమా తీస్తే ఏకంగా 21 రోజుల‌కు సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ మిస్ అయ్యింద‌ట‌. అదేదో చిన్నా చిత‌కా హీరో సినిమాకి అంటే అయ్యో అనుకోవ‌చ్చు. కానీ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన లాల్ స‌లామ్ (Laal Salaam) సినిమాకు సంబంధించి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 21 రోజుల‌కు సంబంధించిన షూటింగ్ ఫుటేజ్ మిస్ అయిపోయింది.

లాల్ స‌లామ్ సినిమా షూటింగ్‌లో భాగంగా ప‌ది కెమెరాల‌తో ఓ క్రికెట్ మ్యాచ్ షూటింగ్ చిత్రీక‌రించార‌ట‌. దీనికి సంబంధించిన ఫుటేజ్ మిస్ అవ‌డంతో మ‌ళ్లీ రీ ఎడిట్ చేయాల్సి వ‌చ్చింద‌ట‌. దాంతో సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌జినీ కూతురు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ తెలిపారు. మ‌ళ్లీ మొత్తం రీ షూట్ చేయాలంటే చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. దాంతో రీ షూట్ చేసే సాహ‌సం చేయ‌లేక‌పోయాం. ర‌జినీకాంత్ లాంటి సూప‌ర్‌స్టార్ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్స్, ఫుటేజ్ పోయిందంటే ఇంత‌కంటే అవ‌మానం ఇంకొక‌టి ఉండ‌దు.

ALSO READ: Indian 2: ఒక్క పాట రూ.30 కోట్లా.. ఏందీ సామి ఇది..!

ALSO READ: సన్నబడిన స్వీటీ.. స్లిమ్ లుక్‌ పిక్ వైరల్