Thalaivar 171: ఇక హీరో కాదు..!

Thalaivar 171: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) 170వ సినిమా అయితే ప్ర‌క‌టించేసారు. ఈ సినిమాకు వెట్టాయ‌న్ (vettaiyan)అనే టైటిల్ ఖరారు అయిపోయింది. జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వ‌కుండానే 171వ సినిమాను లోకేష్ క‌న‌గ‌రాజ్ (lokesh kanagaraj) లాక్ చేసేసారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం ర‌జినీని హీరో పాత్ర‌ల్లోనే చూసాం. కానీ అందరు డైరెక్ట‌ర్లలా ఆలోచిస్తే మ‌న‌లో వెరైటీ ఏముంటుంది అనుకున్నాడో ఏమో. లోకేష్ మాత్రం త‌న సినిమాలో త‌లైవాను నెగిటివ్ రోల్‌లో గ్యాంగ్‌స్ట‌ర్‌గా చూపించాల‌నుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌లైవాను ఎవ్వ‌రూ చూడ‌ని రీతిలో చూపించాల‌నుకుంటున్నారు. ఈ సినిమాలో శివ‌కార్తికేయ‌న్ (siva karthikeyan) కీ రోల్ ప్లే చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.