Laal Salaam: కీలకపాత్రలో మాజీ క్రికెటర్​!

Chennai: సూపర్​స్టార్​ రజినీకాంత్ (Super star Rajinikanth) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లాల్ సలామ్'(Laal Salaam). ఈ చిత్రంలో మొయ్దీన్ భాయ్(Moideen Bhai) అనే పాత్రలో పవర్​ఫుల్​ పాత్రలో రజినీ కనిపించనున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దాదాపు 33 ఏళ్ల తర్వాత ప్రముఖ నటి జీవిత రాజశేఖర్(Jeevitha Rajashekar) ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జీవిత, రజినీకాంత్ సోదరిగా నటించనున్నట్టు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతేడాది ‘అన్నాతే’ చిత్రంతో నిరాశ పరిచిన రజినీ ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్ లో పెట్టారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన వార్త ప్రస్తుతం​ నెట్టింట వైరల్​గా మారింది.

విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా నటిస్తున్న ‘లాల్ సలామ్’ పీరియాడిక్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. మొయ్దీన్ భాయ్ పాత్రలో రజినీ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలో భారత మాజీ క్రికెటర్ కపిల్​ దేవ్(Kapil Dev)​ కూడా లాల్​ సలామ్​ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రజినీ కాంత్​ సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కపిల్​ దేవ్​తో మాట్లాడుతున్న పిక్​ పోస్ట్​ చేసి ‘లెజండరీ క్రికెటర్​తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు రజినీ.​
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్.. ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం రజినీ ఈ సినిమాతోపాటు నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్’లోనూ నటిస్తున్నారు.