Rajinikanth: నా చేత సిగరెట్ మాన్పించాడు.. గొప్ప వ్యక్తి!
Hyderabad: తనకున్న సిగరెట్ అలవాటు మాన్పించిన గొప్ప వ్యక్తి శరత్ బాబు(sarath babu) అంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) ఆయన్ను గుర్తుచేసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శరత్‌బాబు(sarath babu) నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు రజినీకాంత్ వచ్చారు. తనకు శరత్‌బాబుతో ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడారు.
“నేను శరత్ బాబు ఎన్నో మంచి సినిమాల్లో నటించాం. నాకు మంచి మిత్రుడు. నా చేత సిగరెట్ మాన్పించిన గొప్ప వ్యక్తి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు శరత్ బాబే కారణం. లేదంటే నాకున్న సిగరెట్ అలవాటును మానుకోలేకపోయేవాడిని. తన ముందు ఎప్పుడైనా సిగరెట్ పట్టుకుంటే విసిరిపారేసేవాడు. నేను శరత్ అన్నమలై సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం నేను సిగరెట్ తాగాల్సి ఉంది. కానీ ఆ సీన్‌లో కావాల్సిన ఎమోషన్ సరిగ్గా రావడంలేదు. దాంతో ఆ ఒక్క సీన్ కోసం శరత్ బాబే సిగరెట్ తెచ్చి ఇచ్చాడు. ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పే వ్యక్తి ఇప్పుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు రజినీ. శరత్ బాబు పార్ధివదేహానికి నివాళులు అర్పించేందుకు సూర్య(surya), సుహాసిని(suhasini) తదితరులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నారు. రేపు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.