SS Rajamouli: పది భాగాలుగా మహా భారతం!
Hyderabad: తెలుగు సినిమా(Telugu Cinema) ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దర్శకుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli). బాహుబలి(Bahubali), బాహుబలి2(Bahubali2) సినిమాలతో పాన్ ఇండియా(Pan India) ట్రెండ్ క్రియేట్ చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్(RRR)తో ఇండియన్ సినిమాకి ఆస్కార్() అందించి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ దేశవిదేశాల్లో ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబు(Mahesh Babu)తో తన తదుపరి సినిమా ప్రకటించిన రాజమౌళి ఈ సినిమా ప్రీపొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నారు. కాగా, తాజాగా రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం(Maha Bharatam)పై మరోసారి స్పందించారు. చాలా వేదికలపై మహాభారతాన్ని తెరకెక్కించడమే తన డ్రీమ్ అని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.
తెలుగు ప్రేక్షకులతో పాటు, ఇండియన్ ఆడియన్స్ కూడా రాజమౌళి మహాభారతం చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి మహాభారతం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. రాజమౌళి ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఓ మీడియా ప్రతినిధి.. ‘గతంలో మీరు మహాభారతం సినిమా తీస్తా అన్నారు. ఆ కథ టీవీలో సీరియల్ రూపంలో దాదాపు 200 ఎపిసోడ్స్ కి పైగా టెలికాస్ట్ అయింది. మీరైతే ఎన్ని భాగాలుగా తీస్తారు?’ అని అడిగారు.
దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. ‘అది నాకు కూడా తెలియదు. ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ మహాభారతం తీయాలనుకుంటే ముందు భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని మహాభారత వర్షన్లు చదవాలి. అందుకు సంవత్సరం పైనే పడుతుంది. అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఒకవేళ మహాభారతం తీస్తే దాదాపు 10 భాగాలుగా తీయొచ్చు అనుకుంటున్నాను. కానీ కచ్చితమైన నంబర్ చెప్పలేను’ అని అన్నారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. .