SS Rajamouli : వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ పీపుల్​ లిస్ట్‌లో జక్కన్న!

Hyderabad: బాహుబలి(Bahubali) సినిమాతో తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా మార్చేశారు దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli). వరుస హిట్లతో జక్కన్నగా పేరుతెచ్చుకున్న రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​(RRR)తో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఇండియన్ సినిమాని, ముఖ్యంగా తెలుగు సినిమాని ఆస్కార్(Oscar) దాకా తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కింది. ఎన్టీఆర్(NTR)​, రామ్​ చరణ్(Ram Charan)​ హీరోలుగా నటించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు ఆస్కార్(Oscar)​ అందుకున్న రాజమౌళి ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే చాలా పాపులర్ డైరెక్టర్(Director) అయ్యారు. రాజమౌళికి మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.

తాజాగా రాజమౌళి ఓ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్​ విడుదల చేస్తుంది. 2023 సంవత్సరానికి టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి కేవలం ఇద్దరికీ మాత్రమే చోటు దక్కడ విశేషం. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, హాలీవుడ్ స్టార్స్, మెస్సి, ఎలాన్ మస్క్.. లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్న ఈ లిస్ట్ లో ఇండియా నుంచి రాజమౌళి, షారుఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నారు.

టైమ్స్(Times) లిస్ట్ లో చోటు సంపాదించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి(SS Rajamouli) సరికొత్త చరిత్ర సృష్టించారు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజమౌళి బాగా ఫేమస్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జక్కన్నకు అభిమానులు ఏర్పడ్డారు. దీంతో టైమ్స్ 100 వరల్డ్​ మోస్ట్​ పవర్​ఫుల్​ పీపులో లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించారు. ఇక జక్కన్న సాధించిన ఘనతకు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు రాజమౌళిపై అభినందనలు తెలుపుతున్నారు.