Vijayendra Prasad: రాజమౌళి తండ్రి కంటతడి..కారణం ఇదే!
Hyderabad: దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(rajamouli) తండ్రి విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) భావోద్వేగానికి గురయ్యారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్(kangana ranaut) ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ(emergency) సినిమాను ఆయన చూసారు. దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ(indira gandhi) దేశంలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇందులో కంగన.. ఇందిరా గాంధీ క్యారెక్టర్లో నటించారు. సినిమా ఫైనల్ టచ్ అంతా అయిపోవడంతో విజయేంద్ర ప్రసాద్(vijayendra prasad) వీక్షించారు. ఆయన ఒక్కసారిగా సినిమా చూస్తూ భావోద్వేగానికి గురయ్యారని, చాలా బాగా నటించావని అన్నారని కంగన తెలిపారు. అంత గొప్ప స్క్రిప్ట్ రైటర్ నుంచి కాంప్లిమెంట్ వచ్చాక ఇక ఈ జన్మకి ఇది చాలంటూ కంగన(kangana) చాలా సంతోషపడ్డారు. ఈ సినిమాను కంగనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లో కంగన.. ఇందిరా గాంధీని ఇమిటేట్ చేస్తూ నటించిన తీరుకి ఆడియన్స్ షాకయ్యారు. ఆమె తప్ప ఇంకెవరూ ఈ సినిమాకు న్యాయం చేయలేరంటూ ప్రశంసలు గుప్పించారు. అక్టోబర్ 20న సినిమా రిలీజ్ అవబోతోంది.