MR Bachchan: మిస్టర్ బచ్చన్ ఫ్లాప్‌పై హిందీ డిస్ట్రిబ్యూటర్ షాకింగ్ కామెంట్
MR Bachchan: హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాపై ఎక్కువగా నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ ఈరోజుకి ఇంకా దారుణంగా పడిపోయాయి. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ నటించిన రెయిడ్ సినిమాను హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్‌గా రీమేక్ చేసారు. పాటలు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కోసమే ఆడియన్స్ థియేటర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఫలితంపై రెయిడ్ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఒకరు స్పందించారు. అజయ్ దేవగణ్ రెయిడ్ సినిమాలో చాలా బలం ఉందని.. ప్రేక్షకుడు సీట్‌లో అలా కూర్చుండిపోయి సినిమా చూసేలా తీసారని అన్నారు. కానీ హరీష్ శంకర్ మాత్రం హీరోయిన్, హీరోయిజం, ఫైట్స్ పెట్టి తీసారని అది తెలుగు ప్రజలకు నచ్చలేదని అన్నారు. సినిమాలో కంటెంట్ లేకపోవడమే సినిమాకు మైనస్ పాయింట్‌గా మారిందని అభిప్రాయపడ్డారు.