Rahul Ramakrishna: హైదరాబాద్‌పై సంచలన కామెంట్స్..!
Hyderabad: కమెడియన్ రాహుల్ రామకృష్ణ (rahul ramakrishna) సడెన్‌గా ట్విటర్‌లోకి వచ్చి ఓ బాంబ్ పేల్చి వెళ్లిపోతుంటారు. ఈసారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఆయన ఉన్నట్టుండి ఎందుకు ఈ ట్వీట్ పెట్టారో తెలీదు కానీ.. చాలా మంది తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr), మంత్రి కేటీఆర్ (ktr)లను ట్యాగ్ చేస్తున్నారు. ఇంతకీ రాహుల్ రామకృష్ణ ఏం ట్వీట్ చేసారంటే.. “హైదరాబాద్‌లో ట్రాఫిక్ డిసిప్లైన్ ఉంటే బాగుండు. పెడెస్ట్రియన్ పాత్స్ ఉంటే బాగుండు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాని వాళ్లను ఈజీగా వదిలేయకుండా ఉంటే బాగుండు. హైదరాబాద్ అంటే హిందూ వర్సెస్ ముస్లిం అనేలా లేకుంటే బాగుండు. హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి మన పరిసరాల్లో ఉన్న చెరువులు, పార్కులను సంరక్షిస్తే బాగుండు. ద్వేషం అనే ఎమోషన్ లేకుండా ఉంటే బాగుండు” అని ట్వీట్ చేసారు. ఆయన సడెన్‌గా ఈ ట్వీట్స్ పెట్టడానికి రీజన్ ఏంటో తెలీలేదు కానీ.. రానున్న ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గురించి రాహుల్ ఇలా ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
I wish Hyderabad had the best pedestrian paths
I wish we had the best traffic discipline
I really wish people committing traffic violations aren’t let off so easily
I wish Hyderabad isn’t about Hindu vs. Muslim
I wish we conserved our lakes and parks and all natural ecology…
— Rahul Ramakrishna (@eyrahul) May 26, 2023