Raghava Lawrence: దెయ్యం సినిమాలు.. రాత్రిళ్లు నిద్రపట్టడంలేదు
దెయ్యం సినిమాలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది రాఘవ లారెన్స్ (raghava lawrence). ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపు హార్రర్ స్టోరీలతో తెరకెక్కినవే. అందులోనూ కాంచన (kanchana) ఫ్రాంచైస్‌లో వచ్చిన సినిమాల వల్లే తనకు పేరు, డబ్బు వచ్చాయని రాఘవ చెప్తుంటారు. అయితే.. తనకు దెయ్యం సినిమాలకు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు అసలు రాత్రిళ్లు నిద్ర పట్టదని అంటున్నారు రాఘవ. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండేవాడినని.. పడుకున్నా కూడా దెయ్యాలే కలలోకి వస్తుంటాయని తెలిపారు. అయినా కూడా తను దెయ్యం సినిమాలు తీయడం మాననని.. త్వరలో కాంచన 4కి కథ సిద్ధం చేయబోతున్నానని వెల్లడించారు.
ఇక రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తూ నటించిన చంద్రముఖి 2 (chandramukhi 2) అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ (rajinikanth), జ్యోతిక (jyotika) నటించిన చంద్రముఖి అప్పట్లో బాక్సాఫీస్‌ని ఒక ఊపు ఊపేసింది. కానీ చంద్రముఖి 2 మాత్రం మెప్పించలేకపోయింది. కొన్ని సినిమాలను సీక్వల్స్, రీమేక్స్ చేయపోవడమే బెటర్ అని చంద్రముఖి 2 నిరూపించింది.