Lawrence: సూప‌ర్‌స్టార్ టైటిల్ కావాల‌ని ఎవ‌ర‌డిగారు?

కొంత‌కాలంగా కోలీవుడ్‌లో సూప‌ర్‌స్టార్ టైటిల్ (superstar) ఎవ‌రికి ఉండాలి అనే అంశంపై డిబేట్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రేమో త‌లైవా ర‌జినీకాంత్‌కు (rajinikanth) ఉండాల‌ని అంటుంటే మ‌రికొంద‌రు ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి (vijay) ఉండ‌ట‌మే క‌రెక్ట్ అని అంటున్నారు. ఈ డిబేట్‌పై స్పందించారు రాఘ‌వ లారెన్స్ (lawrence) . ఆయ‌న డైరెక్ట్ చేసిన చంద్ర‌ముఖి 2 (chandramukhi 2) ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో లారెన్స్ ఈ సూప‌ర్‌స్టార్ టైటిల్ గురించి ప్ర‌స్తావించారు.

“” అస‌లు సూప‌ర్‌స్టార్ టైటిల్ కావాల‌ని ఎవ‌రు అడిగారు? విజ‌య్ స‌ర్ అడిగారా? లేదా త‌లైవా అడిగారా? నేను ఎప్పుడు విజ‌య్ స‌ర్‌ని క‌లిసినా త‌లైవా ఎలా ఉన్నారు అని అడుగుతారు. అదే విధంగా ఓసారి ర‌జినీకాంత్ స‌ర్‌ని క‌లిసిన‌ప్పుడు బీస్ట్ బ్యాడ్ సినిమా ఏం కాదు అని అన్నాను. అప్పుడు ఆయ‌న స‌న్ పిక్చ‌ర్స్ వాళ్లు చెప్పారు బీస్ట్ క‌లెక్ష‌న్స్ బాగున్నాయ‌ని అన్నారు. అది వారిద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి ఉన్న రెస్పెక్ట్. మ‌ధ్య‌లో మ‌నం ఎవ‌రం? మామిడి చెట్టుకి మామిడి పండ్లే కాస్తాయి. కొబ్బ‌రి చెట్టుకి కొబ్బ‌రికాయ‌లే కాస్తాయి. అలా ఎవ‌రి పాపులారిటీ వారికి ఉంటుంది. ద‌య‌చేసి ఒక హీరోని ఇంకో హీరోతో పోల్చ‌కండి. వారి స్థానాలు వారి అర్హ‌త‌లు వారు క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌వే. “” అని అంద‌రి నోళ్లు మూయించారు లారెన్స్ (lawrence)