Radhika Sarathkumar: నేను దుస్తులు మార్చుకునే చోట కెమెరా
Radhika Sarathkumar: కేరళలో మీ టూ ఉద్యమం సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియా ద్వారా పంచుకున్నారు. తాను హీరోయిన్‌గా నటిస్తున్న రోజుల్లో దుస్తులు మార్చుకునేందుకు తన కోసం ఏర్పాటుచేసిన క్యారవ్యాన్‌లోకి వెళ్లగా.. అక్కడ సీసీ కెమెరా ఉండటం చూసి షాకయ్యానని అన్నారు. వెంటనే క్యారవ్యాన్ నుంచి బయటికి వచ్చి రచ్చ చేసానని.. వారు కెమెరా తీసేసినప్పటికీ తాను దుస్తులు మార్చుకోవాలంటే హోటల్‌లోకే వెళ్లి మార్చుకునేదానినని తెలిపారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటీమణులు తన వద్దకు వచ్చి తాము దుస్తులు మార్చుకునే చోట కూడా కెమెరాలు పెట్టేవారని తనతో చెప్పారని అన్నారు.
మరికొందరైతే తాము హోటల్‌లో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో గది తలుపులు కొట్టేవారని చెప్పారని అది విని తాను షాకయ్యానని అన్నారు. నటీమణులకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సపరేట్‌గా ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసి మరీ ఫోన్లు, ల్యాప్‌టాప్లలో పెట్టుకునేవారని ఆ తర్వాత ఆ వీడియోలను సెట్‌లో ఉన్న ఇతర మగవారు చూసి ఎంజాయ్ చేసేవారని షాకింగ్ ఆరోపణలు చేసారు.