Radhika Apte: టాలీవుడ్ అంటే అసహ్యం
Radhika Apte: నటి రాధికా ఆప్టే కాస్త ఓవర్ చేస్తున్నారు. ఆమె టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో నటించారు. కానీ ఎక్కువగా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పక్క ఇండస్ట్రీలను తిడితే అవకాశాలు వస్తాయని అనుకుంటోందో ఏమో.. టాలీవుడ్ గురించి ఏ ఇంటర్వ్యూలోనూ పాజిటివ్‌గా మాట్లాడటంలేదు. తనకు టాలీవుడ్లో నటించడం ఇష్టం లేనప్పుడు ఒకే హీరోకు సంబంధించిన రెండు సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన లయన్ (Lion), లెజెండ్ (Legend) సినిమాల్లో రాధిక ఆప్టే నటించారు. లెజెండ్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె కాస్త అసౌకర్యానికి గురైనట్లున్నారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు ప్రస్తావించారు.
ALSO READ: 2024: ఆ బాక్సాఫీస్‌ను మడతపెట్టి..!
టాలీవుడ్లో హీరోల రాజ్యం ఉందని.. ఇక్కడి హీరోయిన్లు హీరోలను నా దేవుడు అన్నట్లుగా చూస్తారని అన్నారు. టాలీవుడ్లో తీసే అన్ని సినిమాలు కూడా ఇలాగే ఉంటున్నాయని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. టాలీవుడ్లో నటిస్తున్న సమయంలో తనను అసలు పట్టించుకునేవారు కాదని ఎవరోలే అన్నట్లుగా తనతో ప్రవర్తించేవారని తెలిపారు. సినిమా టీం కూడా హీరోలను ఏమీ అడగరని.. షాట్ రెడీ అయినప్పుడు హీరోకి కనీసం చెప్పకుండా వారు వచ్చినప్పుడే షూటింగ్ మొదలుపెట్టేవారని తెలిపారు. ఈ విషయం తనకు చాలా చిరాకు తెప్పించిందని లయన్, లెజెండ్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఎంత త్వరగా షూటింగ్ అయిపోతే అంత బాగుండు అనిపిచేందని అన్నారు. టాలీవుడ్లో చేసిన ప్రతి సినిమా విషయంలో తాను ఎంతో బాధపడ్డానని అందుకే ఇక తెలుగు సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యానని పేర్కొన్నారు. (Radhika Apte)
రాధిక తెలుగులో నటించిన సినిమాలు
రక్తచరిత్ర (2010)
రక్తచరిత్ర 2 (2010)
ధోని (2012)
లెజెండ్ (2014)
లయన్ (2015)
ALSO READ: Aditi Rao Hydari: సౌత్ వర్సెస్ బాలీవుడ్ అర్థం లేని చర్చ!
రాధిక ఇక్కడ బాలయ్యతో నటించినప్పటి అంశాల గురించే ప్రస్తావిస్తున్నారన్న టాక్ ఉంది. ఎందుకంటే బాలయ్య ఒక్కోసారి సినిమా సెట్స్‌కు ఆలస్యంగా వెళ్తుంటారు. ఇలా కావాలని చేయరు. కానీ కొన్నిసార్లు తప్పదు. పైగా రాధిక నటించిన సినిమాల్లో పెద్ద సినిమాలంటే లెజెండ్, లయన్, కబాలి మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ చిన్న సినిమాలే. చిన్న సినిమాల షూటింగ్ సమయంలో రాధిక ప్రస్తావించిన సమస్యలు ఉండవు. ఎందుకంటే వారు సినిమాపైనే ఫోకస్ చేస్తారు. కానీ బాలకృష్ణ వంటి పెద్ద నటుడితో సినిమా చేస్తున్నప్పుడు షూటింగ్ సెట్స్‌లో ఆయన చెప్పినట్లే విని నడుచుకోవాల్సి ఉంటుంది.
టాలీవుడ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చని ప్రతిసారీ రాధిక తప్పుగానే చెప్తున్నారు. ఆమె ఏదో 20 సినిమాల్లో నటించిట్లు.. పైగా తన కెరీర్‌ను టాలీవుడ్తోనే మొదలుపెట్టినట్లు మాట్లాడుతున్నారు. టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వారెవ్వరూ కూడా ఇలా మాట్లాడింది లేదు. మలయాళ, తమిళ, కన్నడ, హిందీ ఇలా చాలా ఇండస్ట్రీలకు చెందిన నటులు, నటీమణులు టాలీవుడ్లో మంచి పాత్రల్లో నటిస్తున్నారు.
అంతెందుకు.. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించారు. బాలయ్యతో కలిసి పనిచేయడం అసలు మర్చిపోలేని విషయం అని చాలా ఎంజాయ్ చేసానని అర్జున్ అన్నారు. బాలయ్య సెట్స్‌లో ఇతరులకు అసౌకర్యం కలిగించే వ్యక్తి కాదు. అందులోనూ రాధిక ఆప్టే రెండో హీరోయిన్గా బాలయ్య సినిమాల్లో నటించింది. సెట్స్‌లో ఉన్నవారికి ప్రత్యేకించి ఆడవారిని బాలయ్య ఎంతో గౌరవంగా వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటారు. అలాంటిది రాధిక ఆప్టే ఇలా తప్పుగా టాలీవుడ్ గురించి ప్రస్తావించడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.