Radhe Shyam: ఆ హీరో తప్పించుకున్నాడు.. ప్ర‌భాస్ బుక్క‌య్యాడు

రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) కెరీర్‌కే మ‌చ్చ తెచ్చిన సినిమాల్లో రాధే శ్యాం (radhe shyam) ఒక‌టి. ఏదో యువ‌న్ శంక‌ర్ రాజా (yuvan shankar raja) మ్యూజిక్‌తో ఈ సినిమా గ‌ట్టెక్కింది కానీ.. కేవ‌లం స్టోరీనే న‌మ్ముకుని ఉంటే క‌లెక్ష‌న్స్ ఇంకా దారుణంగా ఉండేవి. రాధాకృష్ణ (radha krishna) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే (pooja hegde) న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ముందు ఈ క‌థ‌ను రాధాకృష్ణ విక్ట‌రీ వెంక‌టేష్‌కు (venkatesh) వినిపించార‌ట‌. ఫ‌స్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ బాలేక‌పోవ‌డంతో వెంక‌టేష్ సినిమాకు నో చెప్పేసార‌ట‌. దాంతో ఈ సినిమా ప్ర‌భాస్ చేతిలో ప‌డింది. పాపం ప్ర‌భాస్ ఏదైనా కొత్త‌గా ట్రై చేయాల‌నుకుని సినిమాను ఓకే చేసి బుక్కైపోయాడు.