Pushpa2: అల్లు అర్జున్​ సినిమాలో మెగా డాటర్​!

Hyderabad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ), నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమాతో బన్నీకి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. ఊర మాస్​ లుక్​లో ఫస్ట్​పార్ట్​తో దుమ్ము దులిపిన బన్ని ఈ సినిమా సీక్వెల్​గా తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప2’ (Pushpa2) చిత్రంపై సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే ‘పుష్ప: ది రూల్’ (Pushpa: The Rule) సినిమాని ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించేందుకు భారీ కసరత్తులు చేస్తున్నారు మేకర్స్​. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో మెగా డాటర్​ నిహారికా కొణిదెల(Niharika Konidela)ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

యాంకర్​గా, హీరోయిన్​గా కొన్నాళ్లు పరిశ్రమలో సందడి చేసిన నిహారిక పెళ్లి తర్వాత చాలాకాలం వెండితెరకు దూరంగా ఉంది. కాగా, ఈమధ్య కొంతకాలంగా సోషల్​ మీడియాలో పలు హాట్​ ఫొటో షూట్​ పిక్స్​ షేర్​ చేస్తూ మళ్లీ వెండితెరపై కనపడనున్నట్లు ప్రకటించింది. కాగా, ‘పుష్ప2’లో గిరిజన యువతి పాత్ర కోసం నిహారిక కొణిదెలను సంప్రదించిట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఈ సినిమాకోసం సాయి పల్లవి ఓ పాత్ర చేస్తోంది అని వార్తలు హల్​చల్​ చేశాయి. అయితే సాయి పల్లవి రిజెక్ట్​ చేసిన పాత్రనే ప్రస్తుతం మెగా డాటర్​ చేస్తోందట. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.