Pushpa2: ఈ ఏడాది పార్టీ లేదా పుష్ప?

Hyderabad: అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న పుష్ప2(Pushpa2) సినిమా కోసం టాలీవుడ్​తో పాటు బాలీవుడ్(Bollywood)​ ప్రేక్షకులు కూడా వెయిట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్​ చేసిన టీజర్​, ఫస్ట్​లుక్​తో మరింత ఆసక్తి పెరిగింది. అమ్మవారి గెటప్ లో బన్నీని చూసి షాక్ అయ్యారు అభిమానులు. ఈసారి సినిమా భారీస్థాయిలోనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. పుష్ప ద రూల్ పై అంచనాలు కూడా ఆ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. సుకుమార్(Sukumar)​ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్​ వేగంగా జరుగుతోంది. అందుకు తగినట్టే రిలీజ్​ కూడా వేగంగానే ఉంటుందని అనుకుంటున్నారు అభిమానులు. అయితే తాజాగా పుష్ప2 రిలీజ్​పై ఓ అప్​డేట్ వైరల్​గా మారింది. ఈ సినిమా రిలీజ్​ ఈ ఏడాది లేదట. వచ్చే ఏడాది వేసవి కానుకగా పుష్ప2!Pushpa2)ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట లెక్కల మాస్టారు సుకుమార్.

పుష్ప ద రూల్ ను నెక్ట్ ఇయర్ సమ్మర్ కు అది కూడా అల్లు అర్జున్ నెక్ట్స్ బర్త్ డే సందర్భంగా 2024 ఏప్రిల్ 07 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. దాదాపు ఫిక్స్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. సుకుమార్, బన్నీ కూడా ఈ డేట్ కే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈసినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ మూవీ తో పాటు మ్యూజిక్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా బన్నీకోసం అదరిపోయే ట్యూన్లు రెడీ చేస్తున్నాడట దేవిశ్రీ. ఇక ఈ వార్త విన్న అభిమానులు ‘ఈ ఏడాది పార్టీ లేదా పుష్ప?’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి పుష్ప2తో బన్ని అభిమానులకు పార్టీ ఎప్పుడిస్తాడో చూడాలి.