Pushpa 2: మరో రెండు అదిరిపోయే గెటప్స్​

Hyderabad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప-2(Pushpa2)’ రిలీజ్‌కు ముందే సెన్సేషన్‌ క్రియేట్​ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో గ్లింప్స్ భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక, గంగమ్మతల్లి లుక్‌లో బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్​ మీడియాను షేక్ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా బన్నీ కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. సుకుమార్​(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపై సినీవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమా గురించి తాజాగా మరో వార్త హల్​చల్​ చేస్తోంది. బన్ని గంగమ్మతల్లి లుక్​ ఇంకా ట్రెండింగ్​లోనే ఉండగానే మరిన్ని లుక్స్​కి సంబంధించిన వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో గంగమ్మతల్లి లుక్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా వస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ లుక్‌తో పాటు బన్నీని మరో రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో చూపెట్టేందుకు సుకుమార్ రెడీ అవుతున్నారట. ఈ లుక్స్‌ను కూడా ఎవరూ ఊహించని విధంగా సుక్కు డిజైన్ చేసినట్లు టాక్​.

పుష్ప2 సినిమాలో బన్నీని ఎప్పుడూ చూడని విధంగా చూపించడం ఖాయమని తెలుస్తోంది. ఈ లుక్స్‌ను సినిమాలో చాలా సీరియస్ సీక్వెన్స్‌లలో రివీల్ చేయబోతున్నట్లు టాక్. మరి నిజంగానే బన్నీని మరో రెండు లుక్స్‌లో చూపెట్టి, ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సినిమా సెన్సేషన్​ క్రియేట్​ చేయడం ఖాయం. ఈ సినిమాలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) శ్రీవల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. దేవిశ్రీ ప్రసాద్(Devi sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ అభిమానులు.