Pushpa 2: అమ్మోరు అవతారంలో క‌మెడియ‌న్​.. బన్ని ఫ్యాన్స్​ వార్నింగ్​!

Hyderabad: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 (Pushpa2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్ని బర్త్​డే సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్​, పోస్టర్​ని వదిలారు మేకర్స్​. ఇక ఈ పోస్టర్​లో అమ్మవారి గెటప్‌లో నిజంగానే పూనకాలు రప్పించే లుక్‌లో దర్శనం ఇచ్చి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు అల్లు అర్జున్(Allu Arjun). పుష్ప(Pushpa) మొదటి భాగంలో ఎర్రచందనం కూలీగా, స్మగ్లర్‌గా కనిపించిన అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2లో మాత్రం అదిరిపోయే రేంజ్​లో ఉంటాడని తెలియజేసేలా పాన్​ఇండియా స్థాయి పోస్టర్‌ వదిలారు.
అల్లు అర్జున్ బర్త్ డే ట్రీట్​గా ‘పుష్ప 2’ పై అంచనాలను రెట్టింపు చేస్తూ అమ్మవారి గెటప్‌లో దర్శనం ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చీర, జాకెట్ ధరించి.. మెడలో నిమ్మకాయల దండ వేసుకుని.. నుదుటు పెద్ద బొట్టూ.. కనుబొమ్మల చుట్టూ తెల్లటి బొట్లు.. ఒంటి నిండా నగలు.. చేతికి గాజులతో గంగమ్మ తల్లి గెటప్‌లో దర్శనం ఇచ్చారు అల్లు అర్జున్. పోస్టర్ రిలీజ్ కాగానే పాన్ ఇండియా రేంజ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ పోస్టర్​ ప్రస్తుతం నెట్టింటిని షేక్​ చేస్తోంది.

ఈ నేపథ్యంలో జబర్దస్త్ అవినాష్(Jabardasth Avinash) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినాష్.. ‘పుష్ప 2’ లుక్‌ని ఇమిటేట్ చేస్తూ.. అరకొర ఎడిటింగ్‌తో అతను కూడా ‘పుష్పరాజ్’లా మారిపోయాడు.  ఇక, అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్​ మీడియా వేదికగా అవినాష్‌కి గట్టిగానే వార్నింగ్‌లు ఇస్తున్నారు. ‘అర్జెంట్‌గా డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్దిరో అవినాష్’ అంటూ హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై బన్నీగానీ, అవినాష్​గానీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి!