Pushpa 2: రికార్డు ధరకి ఆడియో రైట్స్​!

Hyderabad: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న మోస్ట్​ అవెయిటెడ్​ పాన్​ ఇండియా(Pan India) మూవీ ‘పుష్ప-2’(Pushpa2). క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మరోసారి పాన్​ ఇండియా లెవల్లో సెన్సేషన్​ క్రియేట్​ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప-2 వీడియో గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.

ఇక పుష్ప సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవీశ్రీ ప్రసాద్(Devi sri prasad)​ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికీ యూట్యూబ్​లో మిలియన్ల వ్యూస్​తో ట్రెండింగ్​లో నిలుస్తూనే ఉంటాయి. అలాంటి బజ్​ క్రియేట్​ చేసిన దేవీ పుష్ప2కి కూడా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా ఆడియో రైట్స్‌కే ఇంత మొత్తంలో భారీ రేటు రావడంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది అత్యధిక ధరగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్​ క్రష్​ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది.