Puneeth Rajkumar ఇంట్లో విషాదం

Bengaluru: దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ (puneeth rajkumar) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయ‌న బంధువు, ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు విజ‌య్ రాఘ‌వేంద్ర (vijay raghavendra) భార్య‌ స్పంద‌న (spandana) గుండెపోటుతో మ‌రణించారు. పునీత్ రాజ్‌కుమార్ కూడా రెండేళ్ల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకాక్‌లో వెకేషన్‌కు వెళ్లిన స్పంద‌న‌.. ఈరోజు తెల్ల‌వారుజామున గుండెపోటుకు గుర‌య్యారు. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. రేపు స్పంద‌న భౌతిక‌కాయాన్ని బెంగ‌ళూరుకు తీసుకురానున్నారు.