Neha Gnanavel: శిరీష్‌.. నువ్వెంత క‌ష్ట‌పడ్డావో నాకు తెలుసు!

Hyderabad: ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా త‌ర్వాత బ‌డ్డీ (buddy) అనే రీమేక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు అల్లు శ‌రీష్‌ (allu sirish). ఇది త‌మిళంలో ఆర్య న‌టించిన టెడ్డీ (teddy) సినిమాకు రీమేక్ అని అంటున్నారు. ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా కుమార్తె నేహా జ్ఞానవేల్ (neha gnanavel) ఈ సినిమాను నిర్మించారు. ఈ సంద‌ర్భంగా శిరీష్ (allu sirish) సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఓ సంద‌ర్భంలో తెలిపారు. శిరీష్‌.. ఈ సినిమా కోసం సెట్స్‌లో నువ్వెంత క‌ష్ట‌పడ్డావో నేను క‌ళ్లారా చూసాను. ఇప్పుడు నీ క‌ష్టం థియేటర్ల‌లో జ‌నాలు చూస్తారు అని అన్నారు. చూడ‌బోతే ఈ సినిమా శిరీష్‌కి ప్ల‌స్ పాయింట్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో ప్రీషా సింగ్ హీరోయిన్‌గా న‌టించారు. చూడ‌బోతే త‌మిళ టెడ్డీ సినిమాకు రీమేక్‌గానే అనిపిస్తోంది కానీ.. ఇది రీమేక్ అని టీం క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ సినిమాను ఆంటోనీ డైరెక్ట్ చేసారు. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ అందించారు. సినిమా ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. గ‌తంలో అల్లు శిరీష్ న‌టించిన ఏబీసీడీ, ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్సే ద‌క్కించుకుంది.