Naga Vamsi: ఎన్నిక‌లు అయిపోయాయ్‌.. మీరు జ‌ర్న‌లిజం మానేస్తారా?

producer naga vamsi slams great andhra

Naga Vamsi: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా వార్త‌లు రాసే ఓ తెలుగు వెబ్‌సైట్‌కి ప్ర‌ముఖ నిర్మాత నాగ‌వంశీ గట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలిచేసారు కాబ‌ట్టి.. ఇక ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడైన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ సినిమాలు మానేస్తారా అని ఓ వార్త ప్ర‌చురించారు. దానిని ట్విట‌ర్‌లో కూడా పోస్ట్ చేసారు. దీనిపై నాగ‌వంశీ స్పందించారు. ఎన్నిక‌లు అయిపోయాయ్ క‌దా.. మ‌రి మీరు జ‌ర్న‌లిజం మానేస్తారా అని మూతి ప‌గిలేలా సెటైర్ వేసారు.