Chittibabu: నేను నోరు విప్పితే బాగుండదు!
Hyderabad: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha), నిర్మాత చిట్టిబాబు(Chittibabu) మధ్య కొన్నాళ్లుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా(Social media) వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం(Shaakunthalam) సినిమా విడుదలై ఘోరంగా విఫలమైంది. ఈ క్రమంలోనే చిట్టిబాబు సమంతను టార్గెట్ చేశారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నాను అనేది అంతా ఓ నాటకం. ఆమె మీడియా ముందు ఏడ్చినంత మాత్రాన ప్రేక్షకులు సినిమా చూడరని అన్నారు. అయితే చిట్టిబాబు మాటలకు సమంత పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చిట్టిబాబు మీద ఒక సెటైర్ పోస్ట్ విడుదల చేశారు. చిట్టిబాబుకు చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ… జనాలకు చెవిలో వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్ లో సెర్చ్ చేస్తే… టెస్టోస్టిరాన్ అధికం కావడం వలన అని చూపించింది, అని ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై చిట్టిబాబు తాజాగా స్పందించారు.
చిట్టిబాబు కూడా సమంతను పరోక్షంగా ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ‘ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను కూడా వారి పేరు చెప్పడం లేదు. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు, నా మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేది, అని అన్నారు. నేను నోరు విప్పితే పరువు పోతుంది’. అని చిట్టిబాబు మాట్లాడాడు. తనని వ్యక్తిగతంగా అవమానించినందుకు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరి చిట్టిబాబు మాటలకి సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!