Pushpa2: రిలీజ్​ ఎప్పుడో చెప్పేసిన బన్నీ వాసు!

Hyderabad: క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) పాన్ ఇండియా స్టార్​ అయిపోయారు. ఈ సినిమా సీక్వెల్​గా రూపొందుతున్న పుష్ప2 రిలీజ్​కోసం పాన్​ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమాతో బన్నీ బాలీవుడ్​లోనూ పాపులర్​ అయ్యారు. పుష్ప 2(Pushpa2) ఫస్ట్​ గ్లింప్స్​కి తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్​ వచ్చాయి.  అంతేకాదు బన్నీ బాలీవుడ్​(Bollywood) ఎంట్రీకీ ప్లాన్​ చేస్తున్నారు బాలీవుడ్​ దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు(Bunny Vas) పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఉన్నారు. ఆ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు చిత్రయూనిట్. ఆ తర్వాత గీత ఆర్ట్స్ లోనే అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తారు. షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ చెయ్యట్లేదు. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ సినిమా యూనిట్ అల్లు అర్జున్ ని సంప్రదించింది. వాళ్లకు ఇంకా ఓకే చెప్పలేదు. కానీ బన్నీ ఈ సినిమా చేయాలనుకుంటున్నాడు’ అని తెలిపారు.