NTR 31: తార‌క్‌కి జోడీగా ప్రియాంక చోప్రా?

Hyderabad: డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే.  NTR 31గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు అనేది ఇంకా వెల్ల‌డించ‌లేదు. అయితే దీనికి సంబంధించిన‌ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 31లో తార‌క్‌కి జోడీగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా (priyanka chopra) న‌టించ‌నున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ప్రియాంక కంటే ముందు దీపిక పదుకొణె (deepika padukone), మృణాల్ ఠాకూర్‌ల (mrunal thakur) పేర్లు వినిపించాయి. కానీ ఈ భారీ ప్రాజెక్ట్ ప్రియాంక చోప్రాకి ద‌క్కిన‌ట్లు తెలుస్తోంది.

ఇండియా పాకిస్థాన్ యుద్ధ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్. దీనిపై NTR31 టీం ఇప్పుడిప్పుడే ఎలాంటి అప్డేట్ ఇవ్వ‌రు. అంత‌లోపు ఎన్ని హీరోయిన్ల పేర్లు వినిపించినా వారి నుంచి ఎలాంటి క్లారిటీ ఉండ‌దు. ఎందుకంటే ఓ ప‌క్క ప్రశాంత్ నీల్.. ప్ర‌భాస్‌తో స‌లార్ (salaar) సినిమాతో బిజీగా ఉన్నారు. మ‌రోప‌క్క తార‌క్.. కొర‌టాల శివ‌తో క‌లిసి దేవ‌ర (devara) షూటింగ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయితే కానీ ప్ర‌శాంత్ వ‌ర్మ‌- తారక్ సినిమాకు సంబంధించి ఏ క్లారిటీని టీం నుంచి ఎక్స్‌పెక్ట్ చేయ‌లేం. ఇదేకాకుండా తార‌క్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసారు. YRF ఫిలింస్ నుంచి వ‌స్తున్న స్పై యూనివర్స్ ఫిలిం వార్‌-2లో (war 2) తార‌క్ న‌టిస్తున్నారు. ఇందులో హృతిక్ రోష‌న్ (hrithik roshan) హీరోగా, ఎన్టీఆర్ విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.