Priyamani: కిస్సింగ్ సీన్.. నా భర్తకు సమాధానం చెప్పాలిగా
Hyderabad: సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి (priyamani) . 2003లో వచ్చిన ఎవరే అతగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అటు హిందీలో 1,2,3,4 అనే స్పెషల్ సాంగ్‌లో షారుక్ ఖాన్‌తోనూ స్టెప్పులు వేసారు. అయితే ఇప్పటివరకు ప్రియమణి సినిమాల్లో ఎలాంటి కిస్సింగ్ సీన్లలో నటించలేదు. ఇప్పటికీ నో కిస్సింగ్ పాలసీకే కట్టుబడి ఉంటానని ప్రియమణి (priyamani) అంటున్నారు. ఈ మాట చెప్పినందుకు చాలా సినిమాలు పోయానని అన్నారు. 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రియమణి. ఇప్పుడు కానీ కిస్సింగ్ సీన్లలో నటిస్తే తన భర్తకు సమాధానం చెప్పలేనని అంటున్నారు. ప్రస్తుతం ప్రియమణి జవాన్, మైదాన్ సినిమాల్లో నటిస్తున్నారు.
“నేను పెళ్లికి ముందే నో కిస్సింగ్ పాలసీని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను నటించిన ప్రతి సినిమాను నా ఇంట్లోవారు చూస్తారు. ఒకవేళ నేను కిస్సింగ్ సీన్లలో నటించానంటే ఏంటి నా కోడలు పెళ్లి తర్వాత కూడా ఇలాంటి వాటిలో నటిస్తోంది అని తప్పుగా అనుకుంటారు. నాకు అలా నచ్చదు. కిస్ అంటే బుగ్గపై పెట్టేలా ఉంటే ఓకే కానీ డైరెక్ట్‌గా అంటే నో అనే చెప్తాను” అని తెలిపారు ప్రియమణి.