Prithviraj Sukumaran: సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే KGF గుర్తు కూడా ఉండదు
Prithviraj Sukumaran: రెబెల్ స్టార్ ప్రభాస్ (prabhas) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక రోజే ఉంది. ప్రశాంత్ నీల్ (prashanth neel) తీసిన ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక రోల్‌లో నటించారు. సినిమా మొత్తం ప్రభాస్, పృథ్వీరాజ్ చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ అవ్వగానే అందరూ KGF యూనివర్స్ అనుకున్నారు. KGFకి సలార్‌కి సంబంధమే లేదని ప్రశాంత్ నీల్ పలుమార్లు చెప్పినా కూడా ఫ్యాన్స్ కన్విన్స్ అవ్వలేకపోతున్నారు.
దాంతో పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్‌ను KGFతో కంపేర్ చేస్తున్నవారికి ఒక మాట చెప్పారు. సలార్ సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే అసలు KGF అనేది గుర్తు కూడా ఉండదని తెలిపారు. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ కంటే బాగా సినిమా వచ్చిందని తెగ హైప్ పెంచేసారు. ఆదిపురుష్ వల్ల విపరీతమైన ట్రోలింగ్‌కి గురైన ప్రభాస్‌కి సలార్ మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.