Prithviraj Sukumaran: చిరంజీవికి రెండు సార్లు నో చెప్పా.. !
Prithviraj Sukumaran: మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి పనిచేసే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. ఆయన పక్కన రెండు క్షణాలు కనిపించినా చాలు అనుకుంటారు. ఇలాంటి అవకాశం రెండు సార్లు వస్తే వదులుకున్నారట ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నప్పుడు ఓ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ను అడిగారట. అప్పటికే పృథ్వీరాజ్ వేరే సినిమా కోసం గడ్డం పెంచుకుని ఉన్నారు. దాంతో నో చెప్పేసారట.
ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి ప్రచార కార్యక్రమంలో భాగంగా చిరు కేరళ వెళ్లినప్పుడు పృథ్వీరాజ్ లూసిఫర్ (Lucifer) సినిమా చేస్తున్నాడని తెలిసింది. కథ బాగుందని అప్పట్లోనే చిరు రీమేక్ హక్కులను కొనుగోలు చేసారు. లూసిఫర్ తెలుగు రీమేక్నుపృథ్వీరాజ్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని చిరు అడిగారట. అప్పటికే పృథ్వీరాజ్ ఆడుజీవితం (Aadujeevitham) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. దాంతో అప్పుడు కూడా చిరుకి నో చెప్పారు. పాపం రెండుసార్లు నో చెప్పినందుకు ఆయన ఏమనుకున్నారో అంటూ పృథ్వీరాజ్ తెగ బాధపడుతున్నారు.