Prithviraj Sukumaran: ఎక్క‌డున్నా ఏం కావాల‌న్నా ప్ర‌భాస్‌కే ఫోన్ చేస్తా

Prithviraj Sukumaran: హైద‌రాబాద్‌లో ఉన్నా ఈ ప్ర‌పంచంలో ఏ మూల ఉన్నా ఏద‌న్నా కావాలంటే ప్ర‌భాస్‌కే (prabhas) ఫోన్ చేస్తాన‌ని అంటున్నారు పృథ్వీరాజ్ సుకుమార‌న్. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన స‌లార్ (salaar) సినిమాలో పృథ్వీరాజ్, ప్ర‌భాస్ స్నేహితుల పాత్ర‌ల్లో న‌టించారు. ఈ నెల 22న సినిమా రిలీజ్ అవ‌బోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైల‌ర్, టీజ‌ర్, సాంగ్స్ విప‌రీత‌మైన హైప్ పెంచేసాయి.

ఈ నేప‌థ్యంలో పృథ్వీరాజ్ ప్ర‌భాస్‌తో త‌న‌కున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. అస‌లు ప్ర‌భాస్‌కి ఉన్న స్టార్‌డం ఏంటో కూడా తెలీనట్లు సాధార‌ణ వ్య‌క్తిలా ఉంటాడ‌ని పృథ్వీరాజ్ తెలిపారు. స‌లార్ షూటింగ్ అంతా కూడా షూటింగ్‌లా కాకుండా గ్రాండ్ పార్టీలా అనిపించేద‌ని ఆ రేంజ్‌లో ప్ర‌భాస్ లంచ్, డిన్న‌ర్ పార్టీలు ఇచ్చేవాడ‌ని అన్నారు. ప్ర‌భాస్ వ్యానిటీ వ్యాన్ చాలా న‌చ్చింద‌ని.. ఇలాంటిది చేయించుకోవాల‌నుకుంటున్నాను అని చెప్ప‌గానే మ‌రుస‌టి రోజు డిజైన‌ర్‌ను పిలిపించి ఇత‌ను నా ఫ్రెండ్.. నా బ్ర‌ద‌ర్ ఇదే డిజైన్ కావాలంట అని వివ‌రాల‌న్నీ చెప్పేసాడ‌ని.. అస‌లు ఇంత సింప్లిసిటీ ఉన్న హీరోని తానెప్పుడూ చూడ‌లేద‌ని చెప్పారు.