Prabhas: ఆయ‌న‌కి ఛాన్స్ ఇచ్చి చూడు డార్లింగ్..!

Hyderabad: ప్రభాస్ (prabhas) అసలే ఇంట్రోవ‌ర్ట్. ఎవరు ఏం చెప్పినా నో అంటే ఏమనుకుంటారో అని తెగ ఫీలైపోతుంటారు. కథ చెప్పడానికి తన దగ్గరికి వచ్చే ప్రతి దర్శకుడికి ఛాన్స్ ఇస్తుంటారు. అందుకే పెద్దగా అనుభవం లేని సుజిత్‌కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. అలా వచ్చిందే సాహో సినిమా. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిపోయింది. అయినా కూడా ప్రభాస్ కొత్త వాళ్లకి ఛాన్సులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు సలార్, కల్కి 2898 AD సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌కి ఒక కథ చెప్పడానికి వచ్చారట‌ ప్రముఖ మ‌ల‌యాళ‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారాన్ (prithviraj sukumaran). ఆయ‌న తీసే సినిమాలే ఒక రేంజ్‌లో ఉంటాయి. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీమ్లా నాయక్ (bheemla nayak) సినిమా మలయాళ వెర్ష‌న్‌ను డైరెక్ట్ చేసింది పృథ్వీరాజ్ సుకుమార‌నే.

ఇప్పుడు ప్ర‌భాస్‌కి (prabhas) ఏదో క‌థ చెప్తే చూద్దాంలే అని ఊరుకున్నార‌ట‌. స‌లార్, కల్కి షూటింగ్స్ అయ్యాక బ‌హుశా ఈ సినిమా గురించి ప్ర‌భాస్ ఆలోచిస్తారేమో చూడాలి. డైరెక్ట్‌గా పృథ్వీరాజే ప్ర‌భాస్ ద‌గ్గ‌రికి వ‌చ్చారంటే ఏదో పెద్ద‌గానే ప్లాన్ చేసిన‌ట్లున్నారు. ఆయ‌న‌కి ప్ర‌భాస్ ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకోవ‌డానికి రెడీగా ఉన్నారు. ఏం జ‌రుగుతుందో చూద్దాం.