Ileana: బాయ్‌ఫ్రెండ్ ఫొటో షేర్ చేసిన గోవా బ్యూటీ
Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా (ileana) తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం అమ్మను కాబోతున్నాను అంటూ ఫొటో షేర్ చేయడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. అసలు ఇలియానాకు (ilena) పెళ్లి ఎప్పుడైంది? ఆమె భర్త ఎవరు? అంటూ ఎన్నో కామెంట్లు వచ్చాయి. కానీ ఇలియానా మాత్రం ఇప్పటివరకు వాటి గురించి స్పందించలేదు. అయితే ఫస్ట్‌టైం ఓ మిస్టరీ వ్యక్తి ఫొటోను షేర్ చేసింది. అతను తన బాయ్‌ఫ్రెండా కాదా అనేది తెలీదు కానీ అతని చెయ్యిపై చెయ్యేసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ఇది నా రొమాంటిక్ ఐడియా.. తనను ప్రశాంతంగా తిననివ్వను అని క్యాప్షన్ పెట్టింది. ఇలియానా చేతికి ఉన్న డైమండ్ రింగ్‌ను బట్టి చూస్తే తనకు ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు అర్థమవుతోంది. దాంతో అతనే ఇలియానాకు కాబోయే భర్త అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇకపోతే.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (katrina kaif) సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉన్నట్లు ఓసారి కత్రినా స్వయంగా వెల్లడించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ షోలో ఇలియానా, సెబాస్టియన్ జోడీ బాగుంటుందని వారిద్దరూ ఇష్టపడుతున్నారని తెలిపింది. బహుశా అతనే ఇలియానాకి కాబోయే భర్త అయివుంటాడు.