Prasanth Varma: అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల కోసం అన‌వ‌స‌రంగా ఎదురుచూసా

Prasanth Varma: ప్ర‌శాంత్ వ‌ర్మ తీసిన హ‌నుమాన్ (hanuman) సినిమా సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. 2024 జ‌న‌వ‌రి టాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఏకైక బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఇదే అని చెప్పాలి. ఇప్పుడు దీనికి పార్ట్ 2 తీసే ప‌నిలో ఉన్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. అయితే ఈ సినిమా క‌థను ప‌ట్టుకుని అల్లు అర్జున్ (allu arjun), ఎన్టీఆర్ (jr ntr), రామ్ చ‌ర‌ణ్‌ల (ram charan) చుట్టూ తిరిగి అన‌వ‌స‌రంగా టైం వేస్ట్ చేసుకున్నాన‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ అన్నారు.

“” నేను స్టార్ న‌టుల‌తో వ‌ర్క్ చేయ‌ను అని చెప్ప‌డంలేదు. వారి కోసం చాలా కాలం పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. నేను కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చ‌రణ్‌ల కోసం ఎంత‌గానో ఎదురుచూసాను. ఆ త‌ర్వాత ఎదురుచూడ‌టం వేస్ట్ అనిపించింది. ఒక డెడ్‌లైన్ పెట్టుకుని ఆ డెడ్‌లైన్ ముగిసాక టామ్ క్రూజ్ వ‌చ్చినా ఆయ‌న‌తో హ‌నుమాన్ తీసేయాలి అనుకున్నాను. ఇప్పుడు హ‌నుమాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది కాబ‌ట్టి బాలీవుడ్ నుంచి చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ నేను రిజెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హ‌నుమాన్ 2 పై మాత్ర‌మే ఫోక‌స్ చేస్తున్నాను “” అని తెలిపారు ప్ర‌శాంత్.